సాక్షి, హైదరాబాద్: తండ్రి మరణంతో విషాదంలో ఉన్న టాలీవుడ్ హీరో శ్రీకాంత్‌ను తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం పరామర్శించారు. ఫిలింనగర్‌లోని శ్రీకాంత్ ఇంటికి వెళ్లి మంత్రి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎమ్మెల్సీ నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ ప్రభాకర్ కూడా శ్రీకాంత్‌ను పరామర్శించారు.
ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ తీవ్ర అనారోగ్యంతో రెండ్రోజుల క్రితం హీరో శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. పరమేశ్వరరావు మరణం పట్ల పలువురు సినిమా ప్రముఖులు సంతాపం తెలిపారు. హీరోలు చిరంజీవి, గోపీచంద్, నిర్మాత అల్లు అరవింద్ తదితరులు శ్రీకాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.